
Eleventh Time in a Row: RBI keeps Repo Rate Unchanged at 4% | వడ్డీరేట్లలో మార్పుల్లేవ్
వరసగా 11వ సారి కూడా కీలక వడ్డీరేట్లలో భారత రిజర్వు బ్యాంకు ఎలాంటి మార్పులు చేయలేదు. ద్రవ్య పరపతి విధాన సమీక్షా నిర్ణయాలు వెల్లడించిన RBI...... రెపో రేటును 4 శాతంగా కొనసాగించింది. రివర్స్ రెపో రేటును.. 3.35 శాతంగా ఉంచింది. ఈ మేరకు RBI నిర్ణయాలను ప్రకటించిన గవర్నర్ శక్తికాంత్ దాస్..కొవిడ్ మహమ్మారి కారణంగా తలెత్తిన మందగమనం నుంచి... క్రమంగా కోలుకుంటున్నట్లు చెప్పారు. 2022-23లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాను 7.8 నుంచి 7.2శాతానికి తగ్గించినట్లు ఆయన తెలిపారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు సమృద్ధిగా ఉన్నందున దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు రిజర్వు బ్యాంకు సిద్ధంగా ఉందని శక్తికాంత్ దాస్ వివరించారు. చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతుందని అభిప్రాయపడ్డారు. మరికొన్ని రోజులు వంట నూనెల ధరలు అధికంగానే కొనసాగే అవకాశముందని అంచనా వేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5.7శాతంగా ఉండవచ్చని శక్తికాంత్ దాస్ వెల్లడించారు. గతంలో ద్రవ్యోల్బణం 4.5గా ఉండొచ్చని చెప్పిన ఆయన తాజాగా 5.7శాతంగా నమోదు కావచ్చని అంచనా వేశారు. #EtvTelangana #LatestNews #NewsOfTheDay #EtvNews ------------------------------------------------------------------------------------------------------ ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ------------------------------------------------------------------------------------------------------ For Latest Updates on ETV Telangana Channel !!! ☛ Visit our Official Website: http://www.ts.etv.co.in ☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7 ☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B ☛ Like us : / etvtelangana ☛ Follow us : / etvtelangana ☛ Follow us : / etvtelangana ☛ Etv Win Website : https://www.etvwin.com/ -------------------------------------------------------------------------------------------------------